: పాకిస్థాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్ల 'విరాట్ కోహ్లీ'లు వీరే!

గతంలో క్రికెటర్లను సచిన్, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్ లతో పోలుస్తూ చెప్పుకునేవారు. వారిలా ఆడగలిగితే అదే చాలనుకునే వారు. అందుకే చాలామంది వారినే ఆదర్శంగా తీసుకునేవారు. పరిస్థితులు మారాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిలకడగా ఆడుతూ పరుగుల యంత్రంగా పేరుతెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు క్రికెటర్లంతా తమను విరాట్ తో పోల్చి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ జట్టుకు కూడ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఉన్నారని పలుదేశాలు క్రికెట్ బోర్డులు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్ జట్టు తమ ఆటగాడు జో రూట్ ను కోహ్లీతో పోలుస్తుండగా, సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ను కూడా కోహ్లీతో పోలుస్తున్నారు. అయితే వీరెవరూ ఇంతవరకు బహిరంగంగా ఆ విషయం చెప్పలేదు. పాకిస్థాన్ జట్టు కోచ్ మికీ ఆర్థర్ మాత్రం తమకు కూడా ఒక కోహ్లీ ఉన్నాడని తెలిపాడు. బాబర్ ఆజమ్ బుల్లెట్ లాంటి ఆటగాడని, భారత జట్టుకు కోహ్లీ ఎంత ముఖ్యమో, పాకిస్థాన్ కు బాబర్ ఆజమ్ అంత విలువైన ఆటగాడని తెలిపాడు. కాగా, షాహిద్ అఫ్రిదీ అరంగేట్రం సమయంలో అతనిని సచిన్ తో పోల్చుతూ పలు కథనాలు పాకిస్థాన్ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే, అతను ఏపాటి ఆటగాడో మనకు తెలిసిందే!

More Telugu News