: వాయు కాలుష్యం వలన ఏడాది కాలంలో భారత్, చైనాల్లో 13 లక్షల మంది చనిపోయారు

పారిశ్రామికీకరణ వల్ల మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. దీని వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల భారత్, చైనా దేశాల్లో ఏకంగా 16 లక్షల మంది మృత్యువాత పడ్డారంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గ్రీన్ పీస్ సంస్థ వెల్లడించింది. తన అధ్యయనంలో మనం నివ్వెరపోయే పలు విషయాలను ఆ సంస్థ తెలిపింది. వాయు కాలుష్యం వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్న తొలి పది దేశాల్లో ఇండియా కూడా ఉందని గ్రీన్ పీస్ వెల్లడించింది. భారత్, చైనాల్లో బొగ్గును అత్యధికంగా వినియోగించడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ రెండు దేశల్లో ప్రతి లక్ష మందిలో 115 నుంచి 138 వరకు వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. వాయుకాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల శాతం మన దేశంలో నాలుగు రెట్లు పెరిగింది. థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల వల్ల వాయుకాలుష్యం భారీగా పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని గ్రీన్ పీస్ సూచించింది.

More Telugu News