: మోదీ ఫొటోలు వాడుకోవడానికి జియోకు అనుమతి ఇవ్వలేదు: కేంద్రం స్పష్టీకరణ

రిలయన్స్ జియో వ్యాపార ప్రకటనల్లో ప్రధాని మోదీ ఫొటోలు దర్శనం ఇవ్వడంతో విమర్శలు చెలరేగాయి. ఇదే విషయంపై ఈ రోజు రాజ్యసభలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ కేంద్రాన్ని నిలదీశారు. దీంతో, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రాతపూర్వకంగా దీనికి సమాధానం చెప్పారు. మోదీ ఫొటోను వాడుకోవడానికి రిలయన్స్ జియోకు అనుమతి మంజూరు చేయలేదని రాథోడ్ స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అటువంటప్పుడు అనుమతి లేకుండానే ప్రధాని ఫొటోను వాడుకోవడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలంటూ ఎంపీ శేఖర్ అడగ్గా... కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ దీనికి సమాధానం ఇస్తుందని తెలిపారు.

More Telugu News