: కొత్త నోట్లలో చిప్ లు పెట్టాలనుకున్నది నిజమేనట!

'కొత్త రూ. 2000, రూ. 500 నోట్లలో చిప్ లు పెట్టారట' అనే వార్త కొన్ని రోజుల పాటు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 8వ తేదీ తర్వాత కొన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకున్నారు. కొత్త నోట్లు అందుకున్న వారైతే... చిప్ ఎక్కడ పెట్టారో అంటూ నోటును నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత నోటులో ఎలాంటి చిప్ పెట్టలేదని ఆర్బీఐ అధికారులు వెల్లడించడంతో అందరూ సైలెంటయిపోయారు. ఈ నేపథ్యంలో చిప్ లకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కొత్త నోట్లలో నానో చిప్ లు లేదా పార్టికిల్స్ (కణాలు) పెట్టాలనుకున్న విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే, అది అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు ఆయన బెంగళూరులో తెలిపారు. అంతేకాదు, ఆ నోట్లను తనిఖీ చేయాలంటే ప్రత్యేక స్కానింగ్ పరికరాలు కావాలని... అది మరింత ఆర్థిక భారం కావడంతో పూర్తిగా వెనకడుగు వేశామని చెప్పారు.

More Telugu News