: రేపు ఒకటో తారీఖు... ఆదుకోవాలంటూ ఆర్బీఐ వైపు రాష్ట ప్రభుత్వాల చూపు

నోట్ల రద్దు తరువాత తొలిసారిగా ఒకటో తారీఖు వస్తోంది. తమ ఉద్యోగులకు జీతాలివ్వాలని, పెన్షనర్లకు పింఛన్లు చెల్లించాల్సి వుందని రాష్ట్ర ప్రభుత్వాలు వాపోతున్నాయి. కేవలం బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వారి చేతుల్లోకి నగదు రాకుంటే, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వుంటుందని భావిస్తూ, తక్షణం డబ్బును విడుదల చేయాలంటూ ఆర్బీఐకి మొరపెట్టుకుంటున్నాయి. ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు, ఒకటో తారీఖులోగా వేతనాలకు సరిపడా డబ్బు ఇవ్వాలని ఆర్బీఐని కోరుతూ లేఖలు రాశాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు నగదును చెల్లించలేమని, నగదు రహిత లావాదేవీల దిశగా ఉద్యోగులు ప్రణాళికలు వేసుకోవాలని చెబితే, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి రూ. 10 వేల నగదును తక్షణ అవసరాలను తీర్చుకునే నిమిత్తం పంచాలని నిర్ణయించింది.

More Telugu News