: డిసెంబర్ 30 వ‌ర‌కే గడువు.. పెంచే ఆలోచన లేదు: కేంద్ర ప్రభుత్వం

పాతనోట్ల మార్పిడిని ఈనెల‌ 24వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఆపేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, పలు నిబంధ‌న‌ల‌తో ప‌లుచోట్ల ర‌ద్ద‌యిన‌ 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా, రద్దయిన పెద్ద‌నోట్ల డిపాజిట్ గ‌డువు తేదీని పెంచాల‌ని వ‌స్తోన్న డిమాండు ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. ముందుగా ప్ర‌క‌టించిన మేర‌కే ఈ గ‌డువు డిసెంబర్ 30వ‌ర‌కే ఉంటుంద‌ని, గడువును పొడిగించే ఆలోచన త‌మ‌కు లేదని పేర్కొంది. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు స‌హా మిగతా బ్యాంకుల వద్ద సరపడా న‌గ‌దు నిల్వలు ఉన్నాయ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

More Telugu News