: మీరు కొత్తగా క్యాష్ లెస్ చెయ్యడమేంటి?... ఆల్రెడీ క్యాష్ లెస్ దేశమే!: కపిల్ సిబాల్ వ్యంగ్యం

నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తామని, తద్వారా నల్లధనానికి చెక్ చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడంపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశాన్ని కొత్తగా క్యాష్‌ లెస్‌ చేయడమేంటి?... మీరు తీసుకున్న డీమోనిటైజేషన్ కారణంగా దేశం ఇప్పటికే క్యాష్ లెస్ గా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అనాలోచిత నిర్ణయం కారణంగా దేశ ప్రజలంతా ఇబ్బందిపడుతున్నారని ఆయన తెలిపారు. నగదు రహిత దేశంగా మార్చడానికి ముందు నోట్ల కష్టాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో 70 శాతం మంది ప్రజలు నెలకు 10 వేల రూపాయల సంపాదనతో బతుకీడుస్తున్నారని, వారంతా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని భావించవద్దని ఆయన సూచించారు.

More Telugu News