: 25 శాతం కమీషన్ తో రూ.1.12 కోట‍్ల ర‌ద్దైన నోట్లను మార్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన వ్యాపారి

పెద్దనోట్ల రద్దు తరువాత నల్లకుబేరులు వాటిని మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధిక సంఖ్య‌లో పోలీసులకు అడ్డంగా చిక్కుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణెకు చెందిన భ‌ర‌త్ షా అనే ఓ వ్యాపారవేత్త త‌న వ‌ద్ద ఉన్న ర‌ద్దైన‌ 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను మార్చుకునేందుకు కొందరు ద‌ళారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి, వారికి 25 శాతం కమీషన్ ఇస్తానని చెప్పాడు. ఈ విష‌యం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఐటీ అధికారులతో క‌లిసి దాడి చేశారు. ఎంజీ రోడ్డులో ద‌ళారుల‌ను కలిసేందుకు చూసిన వ్యాపారిని అక్క‌డే ప‌ట్టుకొని అత‌డి వ‌ద్ద ఉన్న 1.12 కోట‍్ల రూపాయల ర‌ద్దైన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ డ‌బ్బంతా ఎలా వ‌చ్చింద‌ని అడిగిన అధికారుల‌కి భ‌ర‌త్ షా స‌మాధానం చెబుతూ... తాను ఎంతో పొదుపుగా ఇన్నాళ్లూ ఆ డ‌బ్బుని దాచుకుని పెట్టుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

More Telugu News