: నేటి నుంచి బ్యాంకుల్లో నగదు మార్పిడి లేదు!

నేటి నుంచి సామాన్యుడి కరెన్సీ కష్టాలు మరింత పెరగనున్నాయి. రాత్రి జరిగిన కేబినెట్ భేటీలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బ్యాంకుల్లో నోట్ల మార్పిడిని రద్దు చేశారు. కేవలం ఖాతాదారులు మాత్రమే ఈ నోట్లను తమ ఖాతాల్లో జమ చేసుకుని, తరువాత విత్ డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించారు. ఇతరులు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటే బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. లేని పక్షంలో తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లు ఎందుకూ పనికిరావన్న సంగతిని గుర్తుంచుకోవాలి. అలాగే డిసెంబర్ 2 వరకు టోల్ రుసుం రద్దును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 500 రూపాయల నోట్లు డిసెంబర్ 15 వరకు ఆసుపత్రులు, మెడికల్ షాప్స్, పెట్రోల్ పంపుల వద్ద పనిచేస్తాయి. రైల్వే టికెట్లు తీసుకునేందుకు కూడా పాత నోట్లను వినియోగించవచ్చు. అలాగే నవంబర్ 8 తరువాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తాలపై ఆస్తి పన్ను విధించేందుకు చట్టసవరణ చేయనున్నారు. అలాగే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించనున్నారు.

More Telugu News