: మన కొత్త నోట్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన నేపాల్ సెంట్రల్ బ్యాంకు

భారత్ కొత్తగా విడుదల చేస్తున్న రూ.500, రూ.2000 నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద భారత రిజర్వ్ బ్యాంకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఈ కొత్తనోట్ల ఎక్స్ఛేంజ్ ఉండదని నేపాల్ సెంట్రల్ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. కాగా, నేపాల్ లోని చాలా మంది ప్రజల దగ్గర రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. నోట్ల రద్దుతో వారు ఇబ్బంది పడుతుండటంతో, నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నేపాల్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఆర్బీఐకు, మన దేశ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

More Telugu News