: వ్యాపారికి వ‌చ్చిన ఒక్క ఐడియా ఆ గ్రామంలో కాగితాల‌ను క‌రెన్సీ నోట్ల‌లా మార్చేసింది!

ఈనెల 9 నుంచి దేశంలో ఏర్ప‌డిన న‌గ‌దు కొర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు ప‌లు ప్రాంతాల్లో వస్తుమార్పిడి ప‌ద్ధ‌తి పాటిస్తూ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక క్రెడిట్‌, డెబిట్ కార్డుల వినియోగం గురించి తెలిసిన ప్ర‌జ‌లు వాటిని అధికంగా ఉప‌యోగిస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల్లో కొంత మొత్తంలో మాత్ర‌మే డ‌బ్బును విత్ డ్రా చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతో కార్డుల వినియోగం తెలియ‌ని ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇటువంటి ఇబ్బందుల‌ను తొల‌గించుకునే నేప‌థ్యంలోనే మిజోరంలోని కావ్‌బంగ్‌ గ్రామ వాసులు కాగితం ముక్కలనే కరెన్సీ నోట్లుగా మార్చి త‌మ అవ‌స‌రాలు తీర్చుకుంటున్నారు. వస్తువులు అమ్మేవారికి ఇచ్చే డబ్బు మొత్తాన్ని ఓ కాగితం ముక్క‌పై రాసి సంతకం చేసి ఇచ్చి త‌మ‌కు కావ‌ల‌సిన స‌రుకుల‌ను తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో డ‌బ్బులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఆ తెల్ల కాగితాలు మ‌ళ్లీ తీసుకొని అందులో తాము బాకీగా రాసిచ్చిన డబ్బుల్ని వ్యాపారుల‌కు ఇచ్చేస్తారు. ఇటువంటి ప‌ని చేయాల‌న్న ఆలోచ‌న ఆ గ్రామంలో హార్డ్‌వేర్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్న పీసీ లాల్‌ మచునాకి వ‌చ్చింది. త‌న‌కు వ‌చ్చిన ఈ కాగితాల‌ ఐడియాను వెంట‌నే గ్రామస్తుల‌కు చెప్పాడు. దీంతో గ్రామ‌స్తులు అంతా ఒప్పుకొని అక్క‌డి మార్కెట్లో ఈ కాగితాలను ఉప‌యోగిస్తున్నారు.

More Telugu News