: అమెరికాలో సంచ‌ల‌నం.. స్థానిక ఎన్నిక‌ల్లో 23 ఏళ్ల భార‌త సంత‌తి ముస్లిం యువ‌తి ఘ‌న విజ‌యం

అమెరికా స్థానిక ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నం న‌మోదైంది. మేరీల్యాండ్‌లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తికి చెందిన 23 ఏళ్ల ముస్లిం యువ‌తి విజ‌య దుందుభి మోగించింది. భార‌త్‌-పాకిస్థాన్‌కు చెందిన ఆమె త‌ల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రిత‌మే అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. మేరీల్యాండ్‌లోని ప్రిన్స్ జార్జ్‌కౌంటీలో నిర్వ‌హించిన స్కూల్‌బోర్డు రేస్‌లో రాహీలా అహ్మ‌ద్‌(23) విజ‌యం సాధించారు. దీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న అడ్మినిస్ట్రేట‌ర్‌ను 15శాతం ఓట్ల తేడాతో ఆమె ఓడించారు. ర‌హీలా తండ్రి భార‌తీయుడు కాగా త‌ల్లి పాకిస్థానీ. ర‌హీలా గెలిచిన రోజే అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌వ‌డం గ‌మ‌నార్హం. ముస్లింల‌ను అమెరికాలోకి అడుగుపెట్ట‌నిచ్చేది లేద‌ని తెగేసి చెప్పిన ట్రంప్ ఎన్నికైన రోజే హిజాబ్ ధ‌రించే ముస్లిం మ‌హిళ స్థానికంగా ఎన్నిక‌వ‌డం విశేషం. ప్ర‌జ‌ల స‌హకారంతోనే తాను ఎన్నిక‌య్యాన‌ని, త‌న ఎన్నిక ఇత‌ర మైనారిటీల‌కు స్ఫూర్తిగా నిల‌వాల‌ని కోరుకుంటున్న‌ట్టు రాహీలా తెలిపారు.

More Telugu News