: చరిత్రలో తొలిసారి... క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ గా మహిళ

ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదయింది. క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ పదవికి ఓ మహిళ ఎన్నికయింది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులో ఇది సంభవించింది. 122 ఏళ్ల చరిత్ర గల న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షురాలిగా డెబ్బీ హాక్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కాంటర్ బెరీ క్రికెట్ల నుంచి ఈ పదవికి డెబ్బీ నామినేషన్ వేశారు. ఈమె 1962 నవంబర్ 7న క్రైస్ట్ చర్చ్ లో జన్మించారు. డెబ్బీ హాక్లీ 1979లో క్రికెట్ లో ఆరంగేట్రం చేశారు. 2000 సంవత్సరంలో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ టోర్నీలో ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ నాలుగు పరుగుల తేడాతో గెలిచి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 2014లో ఆమె ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించారు. మొత్తం 118 వన్డేలు ఆడిన హాక్లీ నాలుగు సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 4064 పరుగులు చేశారు. అలాగే, 19 టెస్టుల్లో 1301 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

More Telugu News