: జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై ఐదేళ్ల నిషేధం

ఏడాది తరువాతే భారత్ కు వస్తానని చెబుతూ వస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్‌ కు చెందిన ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్‌ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగ్లాదేశ్ లోని రెస్టారెంట్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరేపించబడి దాడులకు పాల్పడినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం ఐఆర్ఎఫ్‌ పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా జకీర్ నాయక్ సంస్థ అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు, అక్రమ లావాదేవీలకు పాల్పడిందని, అందుకే ఐదేళ్ల నిషేధం విధించడం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ జకీర్ నాయక్ గతంలో ఓ టీవీ ఛానెల్ సిఈఓపై 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు.

More Telugu News