: ఖాతాదారులకు ‘సిరా’ గుర్తు పెట్టడంపై మండిపడ్డ మమతా బెనర్జీ

బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకున్న ఖాతాదారులే మళ్లీ మళ్లీ రాకుండా నిరోధించేందుకు గాను వారి వేలిపై ‘సిరా’ గుర్తులు పెడుతుండటంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ విధంగా చేయడం ద్వారా కొంత మేరకు సమస్యను పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ పేర్కొనడంపై ఆమె విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి సామాన్య ప్రజలపై నమ్మకం లేకపోవడం వల్లే ఇటువంటి పనులకు పాల్పడుతోందంటూ మమత తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ నెల 19న పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయని, బ్యాంకు ఖాతాదారుల వేళ్లకు చెరగని సిరా గుర్తు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నికల కమిషన్ హర్షిస్తుందా? అని ప్రశ్నించారు.

More Telugu News