: ఇలా జరుగుతోందేమిటి? పరిష్కారం ఎలా?.. రాత్రంతా మంత్రులతో మంతనాలు జరిపిన మోదీ

పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ఏర్పడిన పరిణామాలు, ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టడం, విపక్షాల విమర్శలు.. తదితరాంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుఝాము వరకూ కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో మోదీ సమావేశం నిర్వహించగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పీయుష్ గోయల్ లతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్యాంకుల చెంత పరిమిత సంఖ్యలోనే కొత్త నోట్లు లభిస్తుండటం, బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజల బారులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్న వదంతులు వంటి అంశాలపై ప్రధాని చర్చించారు. సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలని, ప్రజలకు ఇబ్బందులు రానీయకుండా చూడాలని ఈ సందర్భంగా మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News