: పక్కవాళ్ల డబ్బు వేసుకుంటే మొదటికే మోసం... గ్యాస్ రాయితీ, రేషన్, పింఛన్ కట్!

ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీని అందుకుంటున్న ప్రజలు, అత్యాశకు పోయి, తమ ఖాతాల్లో అక్రమార్కులకు చెందిన డబ్బును వేసేందుకు అంగీకరించి, కమీషన్ తీసుకుంటే వారు తదుపరి తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. జన్ థన్ ఖాతాలతో పాటు, పేదలకు సబ్సిడీ జమ అవుతున్న అందరి ఖాతాలనూ నిశితంగా పరిశీలిస్తున్నామని, వారి ఖాతాల్లో రూ. 2.5 లక్షల జమ అయిన పక్షంలో సబ్సిడీ రద్దయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు హెచ్చరించారు. గ్యాస్ రాయితీ, రేషన్, వృద్ధాప్య పింఛన్ వంటివి తొలగిపోతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇతరుల డబ్బును తమ ఖాతాల్లో వేసుకుని ఇబ్బందులు పడరాదని సూచించారు. ప్రతి ఎకౌంట్ కూ, సదరు ఖాతాదారు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉందని గుర్తు చేశారు.

More Telugu News