: ట్రంప్ ఎన్నికవ్వగానే ఆ పదం వెబ్ సైట్లో మాయం... మీడియా అడగడంతో మళ్లీ ప్రత్యక్షం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ముస్లింలపై ఒంటికాలిపై లేచిన డొనాల్డ్ ట్రంప్ విజయం అనంతరం తన పంథా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా విజయం సాధించిన అనంతరం ట్రంప్ అధికారిక క్యాంపెయిన్ వెబ్ సైట్ నుంచి ముస్లింలపై బ్యాన్ అనే డిమాండ్ అకస్మాత్తుగా మాయమైపోయింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. తాను అధ్యక్షుడినైతే ముస్లింలను దేశంలోకి రాకుండా అడ్డుకుంటానన్న హామీ క్యాంపెయిన్ వెబ్ సైట్ లో కనిపించడం లేదు. ఏమైంది? విజయం సాధించిన తరువాత మనసు మార్చుకున్నారా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో నేడు మళ్లీ ఆ హామీ ట్రంప్ క్యాంపెయిన్ వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది. సాంకేతిక కారణాల వల్లే ఆ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు.

More Telugu News