: త్రివిధ దళాధిపతులను అత్యవసరంగా సమావేశపరచిన మోదీ... మరో సర్జికల్ స్ట్రయిక్స్ అనుకున్న అధికారులు!

నవంబర్ 8, మంగళవారం... సాయంత్రం 4:30 గంటలు. ప్రధాని మోదీ కార్యాలయం నుంచి భారత వాయుసేన, నౌకాదళం, సైనిక అధికారులకు వర్తమానం అందింది. తక్షణం మోదీతో సమావేశానికి హాజరు కావాలన్నది దాని సారాంశం. మరో గంటలో అందరూ మోదీతో సమావేశమయ్యారు. వీరందరి మనసులోని ఆలోచన ఒకటే. మరో సర్జికల్స్ స్ట్రయిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్న మోదీ, అందుకు సలహా, సూచనలు అడుగుతారని భావించారు. లేకుంటే పాక్ కు సంబంధించిన మరో విషయాన్ని చర్చించేందుకు పిలిచారని అనుకున్నారు. కానీ, మోదీ వీళ్ల ముందుంచిన విషయం ఒక్కటే. "నేటి రాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నాము. శాంతి భద్రతల సమస్య తలెత్తితే దాన్ని నివారించేందుకు మీ సహకారం తప్పనిసరి. అందుకే ఈ సమావేశం. ఇక మీ సలహాలివ్వండి" అని అడిగారట. ఆపై పావుగంటకు సదరు మీటింగ్ అయిపోవడం, ఆపై మోదీ మీడియా సమావేశం గురించి పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సమాచారం వెళ్లడం జరిగింది.

More Telugu News