: నోరు జారిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి... రోడ్డుపై బైఠాయించిన బాధితులు

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఊహించని పరిణామం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా కోలమూరు పరిధిలోని జంగాల కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో, బాధితులను పరామర్శించడానికి ఆయన అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ, ఈ ప్రమాదానికి మీరే కారణమని ఆయన అనడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు సాయం చేస్తారని భావిస్తే.... ఘటనకు తామే బాధ్యులమని గోరంట్ల అనడంతో అక్కడివారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే ఉన్న బీజేపీ నేత శీతల్ కూడా ఈ విషయంపై ఎమ్మెల్యేను తప్పుబట్టారు. గోరంట్ల వైఖరికి నిరసనగా ఆయన కాన్వాయ్ కు బాధితులు అడ్డంగా కూర్చున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి గోరంట్లను పంపించేశారు.

More Telugu News