: 6.5 లక్షల హిల్లరీ ఈ-మెయిల్స్ చదవడం గంటల పనే... ఎలాగో చెప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్

హిల్లరీ క్లింటన్ ప్రైవేటు సర్వర్ల నుంచి బయటకు వెళ్లినట్టు చెప్పబడుతున్న 6.5 లక్షలకుపైగా ఈ-మెయిల్స్ ను పరిశీలించామని, అనుమానించాల్సిన అంశాలేవీ లేవని ఎఫ్బీఐ వెల్లడించిన తరువాత రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అసలు 8 రోజుల వ్యవధిలో 6.5 లక్షల ఈ-మెయిల్స్ ను పరిశీలించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ఎఫ్బీఐ అధికారులపై నిప్పులు చెరిగారు కూడా. ఇక ఇదే విషయంలో ప్రజా వేగు ఎడ్వర్డ్ స్నోడెన్ సమాధానం ఇచ్చారు. ఓ జర్నలిస్టు స్నోడెన్ ను ప్రశ్నిస్తూ, 6.5 లక్షల ఈమెయిల్స్ చూసేందుకు ఎన్ఎస్ఏ కు ఎంత సమయం పడుతుందని ట్విట్టర్ వేదికగా అడిగారు. ట్విట్టర్ లో 138 అక్షరాల్లో మాత్రమే ట్వీట్ పరిమితి ఉండగా, అందులోనే ఎడ్వర్డ్ సమాధానం ఇచ్చారు. "తొలుత సమాధానం రానివి, ఆపై మెుయిల్ కు సీసీ, బీసీసీ (కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ)లను తొలగించండి. లక్షల మెయిల్స్ వందల్లోకి వచ్చేస్తాయి. పాత ల్యాప్ టాప్ లు ఈ పనిని నిమిషాల నుంచి గంటల వ్యవధిలో చేస్తాయి" అని చెప్పారు.

More Telugu News