: దయ్యం వేదాలు వల్లిస్తోంది.. వినండి!: రాహుల్ పై వెంకయ్య నిప్పులు

మోదీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల గురించి రాహుల్ మాట్లాడటం, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. "ఆయన అనే ప్రతి మాటా, గతంలో వారి చర్యలను గుర్తు చేస్తోంది. ఆ విషయం ఆయనకు తెలియట్లేదు. 1975 ఎమర్జెన్సీ సంగతేమిటి? ప్రజాస్వామ్యం, హక్కుల గురించి నాడు ఏం చేశారు?" అని ఆయన ప్రశ్నించారు. పాలనా సంబంధ విషయాల్లో ప్రజలు ప్రశ్నించవచ్చని, వారి అభిప్రాయాలను పంచుకోవచ్చని నాయుడు తెలిపారు. అసహజమైన, అపవిత్రమైన పొత్తులను కుదుర్చుకోవడంలో భాగంగానే ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ఎంత చేసినా, యూపీలో బీజేపీని అడ్డుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ పాలించిన రోజుల్లో 21 టీవీ చానళ్లపై నిషేధం విధించారన్న విషయాన్ని వెంకయ్య గుర్తు చేశారు.

More Telugu News