: హెచ్చార్సీని ఆశ్రయించిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను కలిశారు. ఖమ్మం జిల్లాలోని గిరిజనులు విషజ్వరాల బారిన పడుతున్నారని... వాటి నివారణకు సత్వరమే చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హెచ్చార్సీకి ఇచ్చిన పిటిషన్ లో కోరారు. బోనకల్ మండలం రావినూతలలో విషజ్వరాల బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ విమర్శలు గుప్పిస్తోంది. పలు అంశాల్లో ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతోంది. దీంతో, అడపాదడపా మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోదండరాంపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కోదండరాం వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

More Telugu News