: రెండు నెల‌ల్లో ప‌రిష్క‌రిస్తాం.. ఓఆర్ఓపీపై స్పందించిన మ‌నోహ‌ర్‌పారిక‌ర్

వ‌న్ ర్యాంక్ వ‌న్ పింఛ‌న్‌ (ఓఆర్ఓపీ)పై ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ లక్ష‌ల‌ మంది మాజీ సైనికుల స‌మ‌స్య‌ల‌ను రెండు నెల‌ల్లో ప‌రిష్క‌రిస్తామ‌ని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయిలో ఓఆర్ఓపీని అమ‌లు చేయ‌డానికి కొన్ని టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిని అధిగ‌మించి ఓఆర్ఓపీని అమ‌లు ప‌రుస్తామ‌ని పేర్కొన్నారు. ఓఆర్ఓపీ అమ‌లు చేయ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం క‌న‌బ‌రుస్తోన్న తీరుతో మాజీ సైనికుడు రామ్ కిష‌న్ గ్రేవాల్(70) ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఢిల్లీలో పొలిటికల్ వార్ నడిచింది. ప్ర‌తిప‌క్ష పార్టీలన్నీ ఎన్డీఏపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. మ‌రోవైపు ఈ రోజు ఢిల్లీలో పారామిల‌టరీ మాజీ అధికారులు ఓఆర్ఓపీ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ అర్ధ‌న‌గ్నంగా ర్యాలీ నిర్వ‌హించి నిర‌స‌న తెలిపారు.

More Telugu News