: నేనంటే ఇష్టమా? అయితే హిల్లరీకి ఓటేయండి: ప్రచార బాధ్యతను నెత్తినేసుకున్న ఒబామా

డెమొక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ కు మద్దతిచ్చేందుకు అధ్యక్షుడు ఒబామా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. హిల్లరీ విజయం సాధించి వైట్ హౌస్ లో తన వారసురాలిగా రావాలని భావిస్తున్న ఆయన, తాజా సర్వే ఫలితాలతో కొంత కలవరం చెందినప్పటికీ, ఆ వెంటనే హిల్లరీకి ఓటు వేయాలని తెలిపారు. ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ, తన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీకి మద్దతివ్వాలని కొలంబస్ లో జరిగిన ప్రచార సభలో ఆయన అన్నారు. "ఆడవారైనా మగవారైనా ఆమెతో సమానులెవరూ లేరు. నేనైనా, బిల్ క్లింటనైనా... మా కన్నా హిల్లరీకే అర్హతలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చక్కగా అధ్యక్షురాలిగా పనిచేయగలుగుతుంది" అన్నారు. తన కోసం ఏం చేశారో అదే ఇప్పుడు హిల్లరీ కోసం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తనంటే ఇష్టముంటే హిల్లరీకి ఓటేయాలని కోరారు. కాగా, ఈ ఐదు రోజుల పాటు ఒబామా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి హిల్లరీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.

More Telugu News