: జంతర్ మంతర్ సాక్షిగా మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య

ఒకటే ర్యాంకు, ఒకటే పెన్షన్ ఓ మాజీ సైనికోద్యోగి జీవితంలో చిచ్చు పెట్టింది. దీనిపై మనస్తాపంతో ఓ మాజీ సైనికోద్యోగి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతూ విషం పుచ్చుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. 70 ఏళ్ల రామ్ కిషన్ గ్రేవాల్ మరికొందరు మాజీ సైనికోద్యోగులతో కలసి మంగళవారం సాయంత్రం జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాడు. ఒకటే ర్యాంకు, ఒకటే పెన్షన్ విషయంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కు వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నారు. నిరసన తెలుపుతున్న సందర్భంగానే కిషన్ గ్రేవాల్ మనస్తాపంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అతని ప్రాణాలు దక్కలేదు. ఒకటే ర్యాంకు, ఒకటే పెన్షన్ విషయంలో ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోవడం వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రేవాల్ కుమారుడు మీడియాకు తెలిపాడు.

More Telugu News