: సీఎం చంద్రబాబుకు మరింత భద్రతకు కేబినెట్ నిర్ణయం

సీఎం చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయ భవనాల అప్పగింతపై తెలంగాణ మంత్రి మండలి చేసిన తీర్మానంపై చర్చించారు. సచివాలయ తరలింపు ప్రక్రియ ఇంకా సంపూర్ణం కాలేదని మంత్రి వర్గం అభిప్రాయపడింది. సచివాలయ భవనాల అప్పగింతలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించేందుకు, అప్పగింతకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మంత్రి వర్గ ఉపసంఘంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ రావు ఉన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై సబ్ కమిటీ ఏర్పాటు, రాష్ట్రంలో 4 ప్రైవేటు యూనివర్శిటీలకు, విశాఖ జిల్లాలోని మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో 400 ఎకరాల భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ తరహా పూలింగ్ ప్యాకేజీ అమలుపైన, గొర్రెలు, మేకల పెంపకం పాలసీపైన, విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థానంలో విశాఖ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుపైన చర్చ జరిగింది.

More Telugu News