: సంప్రదాయ అమెరికన్ల భయమే... ట్రంప్ కు ఓట్లేయిస్తుంది!

అమెరికాలో పెరిగిపోతున్న జాతి విభిన్నత తమకు ప్రమాదకరమని భావిస్తున్న తెల్లజాతివారి భయాందోళనలు ట్రంప్ కు లాభం చేకూర్చవచ్చని, వారి భయాలు ఓట్ల రూపంలో ట్రంప్ కు దగ్గర కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైకాలజిస్ట్ బ్రెండా మేజర్, ట్రంప్ పట్ల అమెరికన్ల వైఖరిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. మల్టీ కల్చర్ విధానం పట్ల శ్వేత జాతీయులు అసంతృప్తిగా ఉన్నారని, వీరంతా ట్రంప్ మాటల పట్ల ఆకర్షితులవుతున్నారని వివరించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని చెప్పడం, ముస్లింలను దేశంలోకి కాలు పెట్టనివ్వనని వ్యాఖ్యానించడం, విదేశీయులు అమెరికన్ ఉద్యోగాలు కొల్లగొట్టకుండా చేస్తానని హామీ ఇవ్వడం, వీసాల నిబంధనలు కఠినం చేస్తానని చెప్పడం వంటి హామీలు సంప్రదాయవాదులకు ట్రంప్ ను దగ్గర చేశాయని పేర్కొన్నారు.

More Telugu News