: ఆర్థరైటిస్ రోగులకు తేనేటీగ కుడితే మేలే జరుగుతుందట!

ఆర్థరైటిస్ రోగులను తేనేటీగ కుడితే వారికి మేలే జరుగుతుందట. ఈ విషయాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు పేర్కొన్నారు. ఆర్థరైటిస్ రోగులను తేనేటీగ కుట్టినప్పుడు వెలువడే ‘పెప్టైడ్’లో ‘మెలిటిన్’ అనే పదార్థం ఉంటుందని, అది, కీళ్ల మధ్య పనితీరు బాగుండేందుకు బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎముక చివరన ఉండే మృదులాస్థి అనే పదార్థం క్షీణించకుండా ఉండేలా ఈ మెలిటిన్ చూస్తుందని తమ పరిశోధనలో తేలినట్లు చెప్పారు. ‘మెలిటిన్’ వల్ల వయసు పైబడంతో తలెత్తే కీళ్ల సమస్యలకే కాకుండా, ఆటల్లో, ప్రమాదాల్లో గాయపడేవారికి కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. ఎలుకలపై ప్రయోగించిన అనంతరం ఈ విషయం వెల్లడైంది.

More Telugu News