: కల్తీ మద్యం కేసులో వైసీపీ నాయ‌కుల హస్తం ఉంది: గాలి ముద్దుకృష్ణమ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నకిలీ మద్యం కేసులో పాత్ర ఉన్నట్టు సీఐడీ తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... కల్తీ మద్యం కేసులో వైసీపీ నాయ‌కుల హస్తం ఉందని ఉద్ఘాటించారు. అంతేగాక‌, ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక మాఫియాలతో కూడా ఆ పార్టీ నాయ‌కుల‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ పార్టీ నేత‌ల‌కి నేర చరిత్ర ఉందని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ధి లేదని ఆరోప‌ణ‌లు చేస్తోన్న వైసీపీ నేత‌లు రాష్ట్ర జీడీపీని చూడాల‌ని ఆయ‌న సూచించారు. అప్పుడే వారికి ముఖ్య‌మంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి తెలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.

More Telugu News