: జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వాడిన మహిళకు కేన్సర్.. సంస్థకు భారీ జరిమానా విధించిన కోర్టు!

ప్రఖ్యాత ఎఫ్ఎంసీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా విధించారు. ఆ కంపెనీకి చెందిన టాల్కం పౌడర్ ను వాడటం వల్ల ఓ మహిళ అండాశయ కేన్సర్ కు గురైనట్టు తేలడంతో, సెయింట్ లూయిస్ జడ్జి ఈ జరిమానా విధించారు. బాధిత మహిళకు 70 మిలియన్ డాలర్లు (రూ. 467 కోట్లకు పైగా) చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటకే జాన్సన్ అండ్ జాన్సన్ కు వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టుల్లో 1,700 దావాలు నమోదయ్యాయి. చిన్న పిల్లల పౌడర్, షవర్ టు షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ కేన్సర్ కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా బాధిత మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ను వాడుతోందని... మూడేళ్ల క్రితం ఆమె కేన్సర్ కు గురైందని కోర్టు తెలిపింది. కెమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఏది చేయించుకున్నా... రానున్న రెండేళ్లలో ఆమె మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లాయర్లు తెలిపారు.

More Telugu News