: దలైలామా పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయి: చైనా హెచ్చరిక

అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించి చైనా మళ్లీ పాతపాటే పాడింది. ఇటీవల ఇండియాలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడాన్ని తప్పుబట్టిన చైనా... ఇప్పుడు దలైలామా పర్యటన గురించి కూడా అదే విధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ లో టిబెటన్ మత గురువు దలైలామా పర్యటిస్తే... ఆ ప్రాంతంలో శాంతికి నష్టం వాటిల్లి, అస్థిరత ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. దీంతో భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండూ ఇచ్చిన ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలోని తవాంగ్ ప్రాంతంలో దలైలామా పర్యటించనున్నారు. ఆయన పర్యటనను కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

More Telugu News