: బంజారాహిల్స్‌ సితార హోటల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం.. మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాపించ‌డంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లో ఉన్న‌ సితార హోటల్‌లో ఈ రోజు స్వ‌ల్ప అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ స‌మయంలో ఆ హోట‌ల్‌లో క‌స్ట‌మ‌ర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారు. వెంట‌నే వారు అప్ర‌మ‌త్త‌మ‌వ్వ‌డంతో ఎవ్వ‌రికీ గాయాలు కాలేదు. మంట‌లు చెల‌రేగిన వెంట‌నే హోటల్ సిబ్బంది మంటలు ఆర్పేంద‌ుకు ప్ర‌య‌త్నించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

More Telugu News