: తిరిగొస్తున్న కిరాతకుడు... కశ్మీర్ కు పంపిస్తున్న ఐఎస్ఐ!

అహ్మద్ జర్గర్... భారతీయులు దాదాపు మరచిపోయిన పేరిది. కాశ్మీరీ పండిట్లపై జమ్మూకాశ్మీర్ లో ఊచకోతలు జరుగుతున్న వేళ, దాదాపు 40 మందిని హత్య చేసిన కిరాతకుడు. ఆపై పోలీసులకు పట్టుబడి, 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ కు గురైన వేళ, మౌలానా మసూద్ అజర్ తో పాటు ఉగ్రవాదులు విడిపించుకుపోయిన ఐదుగురిలో ఒకడు. అప్పటి నుంచి తమ వద్దే ఆశ్రయం పొందుతున్న జర్గర్ ను మళ్లీ వాడుకోవాలని పాక్ భావిస్తోంది. ఇప్పుడు కాశ్మీర్ లో ఉగ్రవాదుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఇండియాను ఇబ్బందులు పెట్టాలని భావిస్తున్న పాక్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ ఐఎస్ఐ, మరోసారి జర్గర్ ను ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత వారాంతంలో జవాన్లపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించుకోవడం ద్వారా, జర్గర్ స్థాపించిన అల్ ఉమర్ ముజాహిద్దీన్ సంస్థ, తిరిగి తన కార్యకలాపాలు విస్తృతం చేయనుందని నిఘా వర్గాలు పసిట్టాయి. 1989లో మెహబూబా ముఫ్తీ చెల్లెలు రుబయ్యాను కిడ్నాప్ చేసింది జర్గరే. ప్రస్తుతం ముజఫరాబాద్ లో ఉంటున్న జర్గర్, తిరిగి కాశ్మీర్ ప్రాంతంలో సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నట్టు నిఘా వర్గాలకు ఉప్పందినట్టు తెలుస్తోంది.

More Telugu News