: ఎక్కడా తగ్గని హిల్లరీ... అమెరికా ప్రెసిడెంట్ ని నిర్ణయించే మూడు డిబేట్ల ఫలితాలివే!

అమెరికా ప్రెసిడెంట్ ని నిర్ణయించే కీలకమైన బిగ్ డిబేట్లు ముగిశాయి. అమెరికన్లలో మెజారిటీ ప్రజలు అధ్యక్షుడిపై ఒక నిర్ణయానికి వచ్చేశారు. 90 నిమిషాల చొప్పున మూడు సార్లు మొత్తం నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ డిబేట్లలో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. గతంలో అధ్యక్షుడిగా ఉండగా క్లింటన్ పై వచ్చిన అభియోగాలు, హిల్లరీ అధికారిక ఈ మెయిల్స్ అంశాలను వినియోగించుకోవడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు. నోటి దురుసుతో ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని కోల్పోతున్నారు. మొత్తం ప్రచారాన్ని నెగిటివ్ గా నడిపించిన ట్రంప్, అందులో భాగంగా చేసిన ఆరోపణలతో ఆసక్తి రేపి, చివరికి ఆ వ్యాఖ్యలే ఇబ్బందిగా మారి పలు సందర్భాల్లో సతమతమయ్యారు. కాగా, తొలి డిబేట్ లో హిల్లరీ 62% ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఆ డిబేట్ లో ట్రంప్ కు 27% ఓటర్ల మద్దతు పలకడం విశేషం. రెండో డిబేట్ లో హిల్లరీకి 57 శాతం మంది ఓటర్లు మద్దతు పలకగా, ట్రంప్‌ కి 34 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. చిట్టచివరిగా నేడు లాస్ వెగాస్ లో జరిగిన ఫైనల్ బిగ్ డిబేట్ లో హిల్లరీ 52 శాతం ఓటర్ల మద్దతు సంపాదించుకుని తిరుగులేదని నిరూపించగా, ట్రంప్ కు 39 శాతం మంది ఓటర్ల మద్దతు లభించడం విశేషం. దీంతో ఈ మూడు డిబేట్లతో ప్రపంచానికి కాబోయే ప్రెసిడెంట్ గురించి తెలిసిపోయింది.

More Telugu News