: కృష్ణ జింక‌లను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ను వీడని క‌ష్టాలు.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం

కృష్ణ జింక‌లను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను క‌ష్టాలు వీడ‌డం లేదు. కొన్ని నెలల క్రితం ఆయ‌న‌కు కృష్ణజింకల వేట కేసులో విముక్తి లభించిన విష‌యం తెలిసిందే. సల్మాన్‌ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి తీర్పునివ్వ‌డంతో ఆయ‌న ఊపిరి పీల్చుకున్నారు. అయితే, క‌నిపించ‌కుండా పోయిన‌ సల్మాన్ వాడిన జీపు డ్రైవర్ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చాడు. దీంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఈ కేసులో మ‌రోసారి స్పందించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టులో స‌వాలు చేసింది. స‌ల్మాన్ ఖాన్‌పై 17 ఏళ్ల క్రితం అక్రమ ఆయుధాలతో కృష్ణజింకలను వేటాడినట్టు జోధ్‌పూర్‌లో కేసులు నమోదయ్యాయి. అప్ప‌టి నుంచి స‌ల్మాన్ ఈ కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

More Telugu News