: ఢిల్లీ మురికి కూపంగా మారడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సీఎం కేజ్రీవాల్‌కు చీవాట్లు

దేశ రాజధాని ఢిల్లీ రోజురోజుకీ మురికి కూపంగా మారుతోందని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. రోజూ పోగయ్యే చెత్త, ఘన వ్యర్థాలను తొలగించకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని టీవీల్లో వార్తలు వస్తున్నాయని, అధికారులు ఏం చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌ను ఈ విషయంపై ధర్మాసనం నిలదీసింది. టీవీలు వార్తలు ప్రసారం చేస్తుంటే అధికారులు పట్టనట్టు ఉండడం సరికాదని పేర్కొంది. సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతో స్పందించిన రంజిత్ కుమార్.. ఢిల్లీ వీధుల్లో పేరుకుపోయిన చెత్త, ఘన వ్యర్థాల తొలగింపుపై ప్రభుత్వం తీసుకోబోయే చర్చలను త్వరలోనే కోర్టుకు వివరిస్తానని తెలిపారు.

More Telugu News