: తెలంగాణలో బదిలీల రికార్డు... ఒకేరోజు 2 లక్షల మందికి స్థాన చలనం!

ఉద్యోగుల బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డును నమోదు చేసింది. రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా జిల్లాలకు సిబ్బందిని నియమించడం, ఇతర శాఖల నుంచి సర్దుబాటులో భాగంగా ఒకేరోజు రెండు లక్షల మందిని ట్రాన్స్ ఫర్ చేశామని పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఆసాంతం పర్యవేక్షించిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య తెలిపారు. 1992 నుంచి 1994 మధ్య కాలంలో ఒడిశాలో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు, కలెక్టర్, ఆర్డియే వంటి ఉన్నతాధికారులను ముందు నియమించి, ఆపై క్రమేణా కొత్త ఉద్యోగులను నియమించారని, తెలంగాణలో మాత్రం జిల్లా పాలనకు అవసరమైన ఉద్యోగులందరినీ ఒక్కరోజే ఇచ్చామని అన్నారు.

More Telugu News