: 2030 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద నగరంగా ఎదగనున్న ఢిల్లీ

2030 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరంగా ఢిల్లీ ఎదగనుంది. 1950లలో 1.24 కోట్ల జనాభాతో న్యూయార్క్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. దాని తరువాతి స్థానాల్లో టోక్యో, లండన్, ఒసాకా, ప్యారిస్, మాస్కో, బ్యూనస్ ఎయిర్స్, చికాగో, కోల్ కతా, షాంఘై నగరాలు చోటుసంపాదించుకున్నాయి. తదనంతర కాలంలో 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' వెల్లడించిన అంచనాల ప్రకారం టోక్యో అగ్రస్థానంలో నిలిచింది. పట్టణీకరణ నేపథ్యంలో ఉపాధి నిమిత్తం నగరాలకు పల్లెల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పట్టణాలకు వలసలు వెళ్లిపోతున్నారు. దీంతో న్యూయార్క్ ను తోసిరాజని టోక్యో ప్రపంచ అతిపెద్ద నగరంగా ఆవిర్భవించింది. 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' వెల్లడించిన అంచనాల ప్రకారం రానున్న 14 ఏళ్లలో టోక్యోలో జనాభా అనూహ్యంగా పెరగనుంది. పట్టణ వలసలు, జనాభా పెరుగుదల రేటు ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' వెల్లడించింది. ఆ మేరకు రానున్న 14 ఏళ్లలో అంటే 2030 నాటికి టోక్యో జనాభా 3.7 కోట్లకు చేరనుందని తెలిపింది. అప్పటికి ఆయా దేశాల జనాభా ప్రకారం చూస్తే... 55వ స్థానంలో టోక్యో నగరం ఉంటుందని 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' పేర్కొంది. దాని తరువాతి స్థానంలో 3.61 కోట్ల జనాభాతో ఢిల్లీ రెండో అతిపెద్ద నగరంగా అవతరించనుంది. 1970 లో ఢిల్లీ జనాభా కేవలం 35 లక్షలుండగా, ఇప్పుడు గణనీయంగా పెరిగి 1,86,86,902కు చేరుకుంది. ఇలా పెరుగుతూ పోయి మరో 14 ఏళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరంగా ఖ్యాతినార్జించనుంది. 2030 నాటికి ప్రపంచ పది అతిపెద్ద నగరాల్లో టోక్యో, ఢిల్లీ, షాంఘై, ముంబై, బీజింగ్, ఢాకా, కరాచీ, ఖైరో, లగోస్, మెక్సికో సిటీలు నిలవనున్నాయని 'యూఎన్ - వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్స్ట్' నివేదిక వెల్లడించింది.

More Telugu News