: 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 49/1... 11వ ఓవర్ ప్రారంభమయ్యే సరికి టీమిండియా స్కోరు 56/1...ఎలా?

191 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు ఆకట్టుకున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (14) ఆచితూచి ఆడగా, అజింక్యా రహానే (33) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెండో ఓవర్ లో బ్యాటు విరిగిపోవడంతో ఒక ఓవర్ లో నెమ్మదించిన రహానే తరువాత బ్యాటు ఝళిపించాడు. పదో ఓవర్ లో అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో 49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. దీంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. దీంతో ఆ ఓవర్ ను మెయిడెన్ గా చేశాడు. దీంతో పదో ఓవర్ ముగిసేసరికి టీమిండియా 49 పరుగులు చేసింది. 11వ ఓవర్ ప్రారంభమయ్యేసరికి టీమిండియా 56 పరుగులు చేసింది. అదేంటి, పదో ఓవర్ ముగిసేసరికి 49 పరుగులు చేస్తే, 11వ ఓవర్ ప్రారంభమయ్యే సరికి 49 పరుగులే ఉండాలి కదా? 56 పరుగులెలా అయ్యాయి? అన్న అనుమానం వచ్చిందా? 11వ ఓవర్ ను ప్రారంభించిన నీషమ్ తొలి బంతిని వైడ్ గా సంధించాడు. దానిని కీపర్ అందుకోలేకపోవడంతో అది బౌండరీ దాటేసింది. దీంతో వైడ్ తో పాటు 4 పరుగులు వచ్చాయి. అనంతరం రెండు వరుస బంతులను కూడా వైడ్ గా సంధించాడు. దీంతో 11వ ఓవర్ తొలి బంతి కౌంట్ లో కొచ్చేసరికి టీమిండియా స్కోరు బోర్డులో అదనంగా ఏడు పరుగులు వచ్చి చేరాయి. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. రహానే (33), కోహ్లీ (5) క్రీజులో ఉన్నారు.

More Telugu News