: పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు జైలు.. బెంగళూరు ఏసీపీ హెచ్చరిక

పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని బెంగళూరు ఏసీపీ హితేంద్ర హెచ్చరించారు. మైనర్లు తాగి వాహనాలు నడిపినా, ప్రమాదాలు చేసినా వారి తల్లిదండ్రులే శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేస్తున్న మైనర్లు అమాయకులను బలి తీసుకుంటున్నారని అన్నారు. మైనర్లు చేసే తప్పులకు వారి తల్లిదండ్రులు శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇద్దరిపైనా కేసులు నమోదు చేస్తామని ఏసీపీ పేర్కొన్నారు. ఇక నుంచి మద్యం తాగి పట్టుబడిన వారి లైసెన్సులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. ఇప్పటికే నాలుగు వేల లైసెన్సులు స్వాధీనం చేసుకున్నామని, వాటి రద్దుకు సిఫార్సు చేసినట్టు పేర్కొన్నారు.

More Telugu News