: 11 మంది పాకిస్థానీయులకు వీసా మంజూరు.. పాక్ యువతిని రాజస్థాన్ కోడలిని చేయనున్న సుష్మా స్వరాజ్!

రాజస్థాన్ లోని జోధ్‌ పూర్‌ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నరేశ్‌ తేవానీతో పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ ప్రియా బచ్చనీ వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మూడేళ్ల క్రితం వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్ తో రెండు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. దీంతో నవంబర్ 7న జోధ్‌ పూర్‌ లో జరగాల్సిన వీరి వివాహం జరుగుతుందా? అనే అనుమానం రెండు కుటుంబాల్లో నెలకొంది. పాకిస్థాన్ లోని భారత్ ఎంబసీ వీసాలు ఇవ్వడం ఆపేసింది. దీంతో వివాహం కోసం 3 నెలలుగా ప్రయత్నిస్తున్న ప్రియ కుటుంబంలో ఆందోళన నెలకొంది. దీంతో నరేష్ తేవానీ తండ్రి నేరుగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి, పీఎంవోకు తమ వివాహ ఇబ్బందులు తెలిపారు. దీనిపై స్పందించిన సుష్మ సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినట్టే ప్రియ కుటుంబ సభ్యులకు వీసా మంజూరు చేయాలని ఇస్లామాబాద్‌ లోని భారత ఎంబసీని ఆదేశించారు. దీంతో జస్ట్ రెండు రోజుల్లోనే ప్రియ, మరో 11 మంది కుటుంబ సభ్యులకు భారత ఎంబసీ వీసాలు మంజూరు చేసింది. దీంతో తమ వివాహానికి ఎలాంటి అడ్డంకులు లేవని రెండు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమకు సాయం చేసిన సుష్మాస్వరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News