: స్లీపర్ క్లాసులో సామాన్యుడిలా ఊమెన్ చాందీ... దర్పం చూపని మాజీ సీఎం

ఏమాత్రం అవకాశం చిక్కినా, తమ డాబు, దర్పం చూపించే నేతలున్న ఈ రోజుల్లో ఓ మాజీ ముఖ్యమంత్రి సాధారణ ప్రయాణికుడిగా మారి స్లీపర్ క్లాస్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తూ, పక్కవారితో మమేకమైపోయాడు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ, తిరువనంతపురం బయలుదేరి 160 కిలోమీటర్ల దూరం స్లీపర్ క్లాస్ లో ప్రయాణించారు. ఆయన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, దీనిపై చాందీ స్పందిస్తూ, రద్దీలేని స్లీపర్ క్లాస్ రైళ్లలో ప్రయాణాన్ని తాను ఎంతో ఇష్టపడతానని తెలిపారు. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే, రైలు ప్రయాణమే సౌకర్యవంతమని, దీని వల్ల ప్రజల్లో ఒకడిగా కలిసిపోవచ్చని అన్నారు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చని తెలిపారు. వీఐపీలనే భావనపై తనకు నమ్మకం లేదన్నారు. ఈ సంవత్సరం మేలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలుకాగా, చాందీ సీఎం పదవికి దూరమైన సంగతి తెలిసిందే.

More Telugu News