: అబుదాబిలో హిందూ దేవాలయం.. వచ్చే ఏడాదికి పూర్తి

అబుదాబిలో తొలిసారిగా హిందువుల కోసం నిర్మించనున్న ఓ దేవాలయం వచ్చే ఏడాదికి పూర్తి కానుంది. దేవాలయ నిర్మాణం కోసం కావాల్సిన భూమిని ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న హిందువులు పూజల కోసం దుబాయ్ వెళ్లాల్సి వస్తోంది. అబుదాబిలో భారత ప్రధాని మోదీ పర్యటించిన సమయంలో అక్కడి హిందువులు మోదీని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అబుదాబిలో గుడి నిర్మాణం తెరపైకి వచ్చింది. అబుదాబి వెలుపల ఉన్న అల్ వాత్బాలో 20 వేల చదరపు మీటర్ల స్థలాన్ని అబుదాబి ప్రభుత్వం గుడి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిందని భారత్‌కు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి తెలిపారు. దేవాలయ నిర్మాణానికి సహకరించి మతసహనానికి యూఏఈ చిరునామాగా నిలిచిందని కొనియాడారు. 2017 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఇక్కడ మొత్తం 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్టు అక్కడి భారత రాయబార కార్యాలయ గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News