: అశ్విన్ వన్ మ్యాన్ షో... ఇండియా ఘనవిజయం.. క్లీన్ స్వీప్ చేసిన భారత్

భారత్ జట్టు చారిత్రక విజయం సొంతం చేసుకుంది. ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా న్యూజిలాండ్ జట్టుపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. గతంలో ఎన్నడూ లేని ప్రదర్శనతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో ఓటమిపాలైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ డబుల్ సెంచరీ, రహానే సెంచరీతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 557 పరుగులకు డిక్లేర్ చేయగా, రవిచంద్రన్ అశ్విన్ ధాటికి న్యూజిలాండ్ 299 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడు వికెట్ల నష్టానికి పూజారా సెంచరీ చేయగానే 216 పరుగులకు డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా రెండు ఇన్నింగ్సుల్లో 8 వికెట్లు కోల్పోయి 773 పరుగులు చేసినట్టైంది. దీంతో కనీసం డ్రా చేద్దామని బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టును రవిచంద్రన్ అశ్విన్ మరోసారి శాసించాడు. ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ నడ్డివిరిచాడు. దీంతో కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడంలో న్యూజిలాండ్ జట్టు తడబడింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడో టెస్టును టీమిండియా 321 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

More Telugu News