: కశ్మీర్ కు సాయం చేయకుండా భూమ్మీద ఏ శక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు: నవాజ్ షరీఫ్

కశ్మీర్ కు సాయం చేయకుండా ప్రపంచంలోని ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఇస్లామాబాద్ లో నిర్వహించిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కశ్మీరీలు చేస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని భారత్ ఉగ్రవాదంగా భావిస్తోందని అన్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం వందలాది మంది కశ్మీరీ నిరసనకారులను భారత బలగాలు మట్టుబెట్టాయని ఆయన మరోసారి ఆరోపించారు. ఈ ఘటనతోనే రెండు అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయని అన్నారు. ఉగ్రవాదం సహా దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పాక్ అధిగమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా-పాక్ కారిడార్ వల్ల బెలూచిస్థాన్ కే లాభమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News