: అమెరికాలో మరో కాల్పుల ఘటన.. ఒకరి మృతి.. ఎనిమిది మందికి గాయాల‌ు

అమెరికాలో మ‌రోసారి కాల్పుల అల‌జ‌డి చెల‌రేగింది. ప‌లువురు దుండ‌గులు మిచిగాన్‌లో నిన్న‌ ఉదయం కాల్పులు జ‌రప‌డంతో 21 ఏళ్ల జువాన్‌ బోయికిన్ అనే యువ‌కుడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఎనిమిది మంది గాయాల‌పాల‌య్యారు. ఆ ప్రాంతంలో ఓ బిజినెస్‌ అవుట్‌లెట్‌లో పార్టీ జరుగుతున్న సమ‌యంలో దుండ‌గులు విచ‌క్ష‌ణార‌హితంగా ఈ ఘ‌ట‌న‌కు తెగ‌బ‌డ్డారు. గాయాల‌పాలయి చికిత్స పొందుతున్న వారిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఎవ్వ‌రినీ అదుపులోకి తీసుకోలేదు.

More Telugu News