: పాక్ లో ప్రతి నలుగురిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు!

దాయాది దేశం పాకిస్థాన్ లోని ప్రతి నలుగురిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ కథనం ప్రకారం, పాక్ ప్రస్తుత జనాభా 19.3 కోట్లు కాగా... అందులో 5.5 కోట్ల మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అగాఖాన్ యూనివర్శిటీ మానసిక విభాగపు ఛైర్మన్ డాక్టర్ ఆయేషా మియాన్ తెలిపారు. ఇందులో 3.5 కోట్ల మంది పెద్దవారు కాగా, 2 కోట్ల మంది చిన్నారులు. ఈ సమస్యలతో బాధపడే వారి ప్రవర్తన తేడాగా ఉంటుందని... హింసాత్మకంగా వారు వ్యవహరిస్తారని... వారి వల్ల సమాజానికి ఏ మాత్రం మేలు జరిగే అవకాశం లేదని ఆయేషా వెల్లడించారు. ఇలాంటి వారికి కుటుంబసభ్యులు, స్నేహితులు, సమాజం సరైన తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమస్య పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఆమె చెప్పారు.

More Telugu News