: హిందూ సంస్థలు అభ్యంతరం చెప్పడంతో కొత్త సినిమా టీజర్ ను డిలీట్ చేసిన 'బిచ్చగాడు' హీరో

'బిచ్చగాడు' సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా క్రేజ్ ను పెంచుకుని, మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తమిళంలో 'సైతాన్' సినిమా రూపొందిస్తున్నాడు. దీనిని తెలుగులో 'భేతాళుడు' పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను విజయ్ ఆంటోనీ ఈ మధ్యనే విడుదల చేశాడు. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోరు కోసం కొన్ని సంస్కృత పదాలను వాడారు. ఈ పదాలు వేదాల్లోని శ్లోకాల నుంచి తీసుకున్నవి. వాటిని 'భేతాళుడు' వల్లిస్తాడు. దీంతో ఈ పదాలపై పలు హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందూ ధర్మంలో వేదాల్లోని శ్లోకాలకు శక్తులను పారద్రోలే శక్తి ఉందని, అలాంటి శ్లోకాలను 'సైతాన్' పలకడమేంటని పలువురు ప్రశ్నించారు. దీంతో జాగ్రత్తపడ్డ విజయ్ ఆంటోనీ...ఈ టీజర్ ను యూట్యూబ్ నుంచి తీసేస్తున్నానని, కొత్త టీజర్ ను పాటతో పాటు విడుదల చేస్తానని ప్రకటించాడు.

More Telugu News