: పాక్ ను అధిగమించాలంటే టీమిండియా మూడో టెస్టులో కూడా నెగ్గాల్సిందే!

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ ను నెట్టి మొదటి స్థానంలోకి రావాలంటే కనుక మూడో టెస్టులో కూడా భారత్ తప్పకుండా నెగ్గాలని గణాంకాలు చెబుతున్నాయి. రెండు టెస్టులు నెగ్గిన భారత జట్టు ఖాతాలో ప్రస్తుతం 110 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ చేతిలో 111 పాయింట్లు ఉన్నాయి. మూడోది గెలిస్తే టీమిండియా 115 పాయింట్లు సమకూర్చుకుంటుంది, డ్రా అయితే 113 పాయింట్లు ఉంటాయి. అదే ఓడిపోతే కనుక 111 పాయింట్లు వుంటాయి. దీంతో పాకిస్థాన్ డెసిమల్ ఫ్రాక్షన్ పాయింట్లతో ముందుండి, మళ్లీ అగ్రస్థానానికి చేరే ప్రమాదం ఉంది. డ్రా అయితే విండీస్ తో టెస్టు సిరీస్ ఉండడంతో పాక్ మళ్లీ అగ్రస్థానం సాధించే ప్రమాదం ఉంది. విజయం సాధిస్తే మాత్రం భారత్ అగ్రస్థానానికి ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదు.

More Telugu News